Share News

ప్రమాదాల నివారణ అందరి బాధ్యత

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:23 PM

ప్రమాదాల నివారణకు ప్రతీ వ్యక్తి పనిచేయాల్సిన బా ధ్యత ఉందని అయిజ ఎస్‌ఐ శ్రీనివాసరావు అ న్నారు.

ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
కర్నూల్‌ రహదారి అయిజ పెద్దవాగు వంతెనపై గోతిని పూడ్చుతున్న పోలీసు, అధికారులు

  • అయిజ పెద్దవాగు వంతెనపై గొయ్యి పూడ్చివేత

అయిజ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రమాదాల నివారణకు ప్రతీ వ్యక్తి పనిచేయాల్సిన బా ధ్యత ఉందని అయిజ ఎస్‌ఐ శ్రీనివాసరావు అ న్నారు. శనివారం ఉదయం కర్నూల్‌ రహదారి అయిజ సమీపంలోని పెద్దవాగు కల్వర్టు వంతెనపై బారీ గొయ్యి ఏర్పడింది. ఇది ప్రమాద భరితంగా తయారయ్యింది. ఇది తెలిసిన ఎస్‌ఐ శ్రీనివాసరావు పోలీసు సిబ్బందిని పంపించి ప్రమాదసూచికలు ఏర్పాటు చేశారు. దీనితో స మస్య పరిష్కారం కాదు, ప్రమాదాలు నివారించలేమని భావించారు. ఆదివారం ఉదయం క ర్నూల్‌ రహదారి అయిజ పెద్దవాగు వంతెనపై పడ్డ గొయ్యిని ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆర్‌అండ్‌బీ అధి కారులతో కలిసి పూడ్చివేశారు. తాత్కాలికంగా కాకుండా రాళ్లు, సిమెంట్‌తో మరోమారు అక్కడ గొయ్యి పడకుండా పనులు చేశారు.

Updated Date - Oct 05 , 2025 | 11:23 PM