Share News

ప్రమాదమా.. హత్యా?

ABN , Publish Date - Nov 22 , 2025 | 11:32 PM

కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచు చిన్న భీమరాయుడు (40)ని శుక్రవారం ధరూర్‌ మం డలం జాంపల్లి వద్ద బొలెరో వాహనం ఢీకొ నగా, మృతి చెందాడు. ఆయన మృతిపై కు టుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఎనిమిది మందిపై ఫిర్యాదు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేశారని ఆరోపిస్తూ శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఽధర్నా నిర్వహించారు.

 ప్రమాదమా.. హత్యా?
గద్వాల పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న నందిన్నె గ్రామస్థులు, నాయకులు

- భీమరాయుడుని హత్య చేశారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు

- పోస్టుమార్టం అనంతరం మృతదేహంతో గద్వాలలో ర్యాలీ

ధరూర్‌/ కేటీదొడ్డి/ గద్వాల క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచు చిన్న భీమరాయుడు (40)ని శుక్రవారం ధరూర్‌ మం డలం జాంపల్లి వద్ద బొలెరో వాహనం ఢీకొ నగా, మృతి చెందాడు. ఆయన మృతిపై కు టుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ ఎనిమిది మందిపై ఫిర్యాదు చేశారు. ఇది రోడ్డు ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగానే వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేశారని ఆరోపిస్తూ శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున ఽధర్నా నిర్వహించారు. అనంతరం ప్లెక్సీలతో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ నాయకుడు బాసు హనుమంతునాయుడు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీఎస్పీ మొగులయ్య, సీఐ టంగుటూరి శ్రీను, ఎస్‌ఐలు ఆసుపత్రి వద్ద బందోబస్తు నిర్వహించి పోస్టుమార్టం చేయించా రు. అనంతరం మృతదేహాన్ని వాహనంలో ఎక్కించి గద్వాల పట్టణం గుండా ర్యాలీగా నందిన్నె గ్రామానికి చేరుకున్నారు.

హత్య దిశగా విచారణ ముమ్మరం

కాగా మాజీ సర్పంచు చిన్న భీమరాయుడుది రోడ్డు ప్రమాదం కాదని హత్యేనని కు టుంబ సభ్యులు తేల్చిచెప్పడంతో పోలీసు లు ఆ దిశగా విచారణ ముమ్మరం చేశారు. ఆయనతో ఎవరెవరికి వైర్యం ఉందో ఆరా తీశారు. గత కొన్ని నెలల నుంచి ఓ వ్యాపా రి చేసిన కోట్ల రూపాయల అక్రమాలను వె లుగులోకి తీసుకరావడంతో కేసు నమోదు అయ్యింది. దీనిని మనసులో పెట్టుకొని ఏ మైన చేశాడా అనేకోణంలో విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫోన్‌పేలో బొలెరో వాహనం డ్రైవర్‌కు డబ్బు పంపించిన విష యం గుర్తించినట్లు తెలిసింది. అదేవిధంగా దాయాదుల మధ్య పొలం వివాదంతో పా టు ఇతర అంశాలపై దృష్టి పెట్టారు. ఇప్ప టికే కొందరిని అదుపులోకి తీసుకొని విచార ణ చేస్తున్నట్లు తెలుస్తున్నది. భీమరాయుడు ని ఢీకొట్టి వాహనం కర్నూల్‌ జిల్లా గోనెగం డ్ల మండలం, పుట్టపాశం గ్రామంగా తేల్చారు.

నందిన్నెలో ఉద్రిక్త వాతావరణం

కాగా గద్వాల నుంచి మధ్యాహ్నం మూ డు గంటలకు మృతదేహం నందిన్నెకు చేరుకుంది. గ్రామంలో ర్యాలీ నిర్వహించి కొద్దిసేపు ధర్నా చేశారు. మృతదేహాన్ని ఇంటికి చేర్చే క్రమంలో వై రం ఉన్న వ్యాపారికి సంబంధించి ఆస్తులు కనిపించడంతో ఒక్కసారిగా గ్రామస్థులు, అభిమానులు రాళ్లు రువ్వారు. పోలీసులు 200 మందికిపైగా బం దోబస్తు నిర్వహించడంతో వారిని అడ్డుకున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 11:32 PM