Share News

కనుల పండువగా కల్యాణోత్సవం

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:41 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా, చిన్నచింతకుంట మండలం, అమ్మాపూర్‌ సమీపంలోని కురుమూర్తి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి.

కనుల పండువగా కల్యాణోత్సవం
ఊరేగింపులో స్వామి వారికి హారతి ఇస్తున్న అర్చకుడు

- ప్రారంభమైన కురుమూర్తి బ్రహ్మోత్సవాలు

- స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

- మయూర వాహనంపై శ్రీనివాసుడి దర్శనం

చిన్నచింతకుంట, అర్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జిల్లా, చిన్నచింతకుంట మండలం, అమ్మాపూర్‌ సమీపంలోని కురుమూర్తి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా అర్చకులు, వేదపండితులు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. రాత్రి స్వామి, లక్ష్మీదేవి అమ్మవార్లు మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణతో కురుమూర్తి గిరులు మారుమోగాయి. భక్తులు దాసంగాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఉదయం స్వామి సన్నిధిలో కొత్తకోట దయాకర్‌రెడ్డి కుమారుడు సిద్ధార్థరెడ్డి, నేహ దంపతులు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అఖండ దీపాన్ని వెలిగించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ గోవర్ధన్‌రెడ్డి, ఈవో మదనేశ్వర్‌రెడ్డి, మాజీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సభ్యులు భాస్క రాచారి, కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 10:42 PM