Share News

కనుల పండువగా కల్యాణం

ABN , Publish Date - Mar 12 , 2025 | 10:50 PM

అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం లో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై, ప్రత్యేక పూ జలు చేశారు.

కనుల పండువగా కల్యాణం
తాళిని చూపుతున్న పురోహితుడు

అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

మూసాపేట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): అడ్డాకుల మండలం కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం లో పార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎ మ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై, ప్రత్యేక పూ జలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారికి అన్నదానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయ ఆవరణలో రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు ఘనంగా సన్మానించారు. శుక్రవారం తెల్లవారుజామున రథోత్సవా న్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కారెడ్డి నాగిరెడ్డి, కాంగ్రెస్‌ మం డల అధ్యక్షుడు తోట శ్రీహ రి, ఆలయ ఈవో రాజేశ్వర్‌శర్మ, ఆలయ చైర్మన్‌ రవిందర్‌శర్మ, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2025 | 10:50 PM