కవయిత్రి మొల్లకు ఘన నివాళి
ABN , Publish Date - Mar 13 , 2025 | 11:09 PM
సమాజ శ్యేయస్సు కోసం తన జీవితాన్ని త్యజించిన కవయిత్రి మొల్ల అని మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు.

మహబూబ్‌నగర్ న్యూటౌన్/పాలమూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : సమాజ శ్యేయస్సు కోసం తన జీవితాన్ని త్యజించిన కవయిత్రి మొల్ల అని మాజీ మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గ్రీన్‌బెల్ట్‌లో కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. శ్రీకృష్ణదేవరాయల కాల సమయంలో ఆము రాసిన మొల్ల రామాయణం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. ప్రశాంత్, కుమ్మరి సంఘం పెద్దలు బుగ్గన్న, రామచంద్రయ్య, ఎల్లప్ప, రాజశేఖర్, నాగప్ప, రవికుమార్ పాల్గొన్నారు. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ కవయిత్రి మొల్ల విగ్రహానికి నివాళి అర్పించారు. సారంగి లక్ష్మీకాంత్, అశ్వినిసత్యం, దుర్గేష్, శేఖర్, విశ్వనాథ్, శంకర్‌బాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు. కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్ల జయంతిని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. బుగ్గన్న, రామచంద్రయ్య, ఎల్లప్ప, టీకే మల్లేష్, నాగప్ప, కొండల్, గోపాల్, రవికుమార్, మాసయ్య, వెంకటయ్య, రాజు, బాలచందర్, రామచంద్రయ్య, రాములు పాల్గొన్నారు.
జడ్చర్ల : రామయాణాన్ని తెలుగులో రచించిన కవయిత్రి మొల్ల జయంతిని పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద కుమ్మరి సంఘం నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కౌన్సిలర్ నవనీత, కుమ్మర సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కొండల్, ఎల్లప్ప, కుమార్, ప్రవీణ్, శివదర్శన్, రవితేజ, రమేశ్, రాఘవేందర్, కృష్ణ, నాగరాజు, శ్రీను, మల్లేష్, జనార్దన్, గణేష్, తిరుమలేష్ పాల్గొన్నారు.