జవహర్‌లాల్ నెహ్రూకు ఘన నివాళి
ABN , Publish Date - May 27 , 2025 | 11:05 PM
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతిని మంగళవారం జడ్చర్లలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు.
జడ్చర్ల, మే 27 (ఆంధ్రజ్యోతి) : దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతిని మంగళవారం జడ్చర్లలో కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని సిగ్నల్‌గడ్డ ప్రాంతంలోని నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ రాజేందర్‌గౌడ్, నాయకులు బుర్ల వెంకటయ్య, మినాజ్, బాదిమి రవిశంకర్, బుక్క వెంకటేశ్, కాట్రేపల్లి లక్ష్మయ్య, గాంగ్యానాయక్, అయ్యన్న, ఆనంద్, గోపాల్‌నాయక్, నక్క రాఘవేందర్, లక్ష్మమ్మ పాల్గొన్నారు.
నవాబ్‌పేట : జవహర్‌లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మార్కెట్ చైర్మన్ హరలింగం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య మాట్లాడుతూ నెహ్రూ సేవలను కొనియాడారు. కాంగ్రెస్ నాయకులు భూపాల్‌రెడ్డి, హమీద్ మహేక్, నీలకంఠం, బంక వెంకటయ్య, శివకుమార్, అంజన్‌కుమార్ యాదవ్, ముంత నర్సింహులు, కోట్ల రాజేష్, ఆనంద్, భాస్కర్‌నాయక్, సత్యంగౌడ్, సంతోష్‌నాయక్, ఎర్కలి రాములు, బాలరాజు, గోపాల్‌యాదవ్, నర్సింహులు పాల్గొన్నారు.
రాజాపూర్ : మండల కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ శేఖర్‌గౌడ్, డైరెక్టర్ పంచాక్షరి, నరహరి, కృష్ణయ్య, అశోక్, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్, రాజేష్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివని టీసీసీసీ ప్రధాన కార్యదర్శి వి నోద్‌కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జవర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రజా సంక్షేమం సాధ్యం అన్నారు. ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ జీనే బె నహర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సిరాజ్ ఖాద్రి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షడు సాయిబాబా, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మత్ అలీ, జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఫయాజ్, నాయకు లు అక్బర్, గులాం జహీర్, పీర్‌సాధిక్, అంత య్య, నాగరాజు, వెంకటలక్ష్మి, జగదీష్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.