మూన్నాళ్ల ముచ్చటగా సోమశిల సఫారీ టూర్
ABN , Publish Date - May 11 , 2025 | 11:32 PM
దట్టమైన అడవులకు ప్రసిద్ధిగాం చిన కొల్లాపూర్ నల్లమల్ల అడవులను పర్యాటకులు సందర్శించేలా
పర్యాటకులకు అందుబాటులోకి రాని ఎకో పార్కు
వెనక్కి తిరిగి వెళ్లిన సఫారీ వాహనం
కొల్లాపూర్, మే 11 (ఆంధ్రజ్యోతి): దట్టమైన అడవులకు ప్రసిద్ధిగాం చిన కొల్లాపూర్ నల్లమల్ల అడవులను పర్యాటకులు సందర్శించేలా అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమశిల రహదారిలో నిర్మించిన ఎకో పార్కు సఫారీ టూర్ కేవలం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. అటవీ శాఖ ఆధ్వర్యం లో సోమశిల రహదారిలో భారీ వ్యయంతో ఎకో పార్కుతో పాటు వాచ్ టవర్ నిర్మించారు. వాచ్ టవర్ నుంచి సోమశిల కృష్ణానది అందాలను వీక్షించేలా వసతులు ఉన్నప్పటికీ సఫారీ టూర్ మాత్రం అటవీశాఖ అధి కారులు నడపడం లేదు. ఎకో పార్కు తలుపులు ఎప్పుడు మూసి ఉండ డంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు స్థానిక ప్రజలు పా ర్కు సందర్శించలేకపోతున్నారు. కొన్నిరోజులు మాత్రమే సోమశిల నుంచి ఈ పార్కు వరకు సఫారీ టూర్ నడిపిన అటవీశాఖ నెల రోజులలోపే సఫారీ టూర్ నిలిపివేసి ఆ వాహనాన్ని జిల్లా అటవీశాఖ కార్యాలయా నికి తిరిగి పంపించారు. భారీగా నిధులతో పార్కు వాచ్ టవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేసిన అటవీ శాఖ దానిని వీక్షించేందుకు మాత్రం అనుమతి ఇవ్వకపోవడంపై పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.