క్రీడలకు నెలవు.. మహబూబ్‌నగర్
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:16 PM
జిల్లాలో క్రీడా రంగానికి బాటలు వేగంగా పడుతున్నాయి.
- రూ.16.40 కోట్లతో క్రీడామైదానాల అభివృద్ధి
- సింథటిక్ ట్రాక్ నిర్మాణానికి రూ.10 కోట్లు
- ఇండోర్‌లో రూ.2.70 కోట్లతో సెంట్రలైజ్డ్ ఏసీ
- ఓపెన్, ఇండోర్ జిమ్‌ల నిర్మాణం
మహబూబ్‌నగర్‌స్పోర్ట్స్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో క్రీడా రంగానికి బాటలు వేగంగా పడుతున్నాయి. రూ.16.40 కోట్లతో క్రీడాభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది. రూ.2.70 కోట్లతో ఇండోర్‌స్టేడియంలో ఏసీ, రూ.51 లక్షలతో ఇండోర్‌జిమ్, రూ.45 లక్షలతో స్కేటింగ్ రింగ్, రూ.32 లక్షలతో వాలీబాల్ బాలికల హాస్టల్ నిర్మాణ పనులు, రూ.72 లక్షలతో స్టేడియం నిర్మాణ పనులు చేపట్టానున్నారు. మహబూబ్‌నగర్ నియోజవర్గంలో రూ.కోటితో 4 ఓపెన్ జిమ్‌ల నిర్మాణం చేపట్టానున్నారు. వాలీబాల్ క్రీడాకారులు ఎదురుచూస్తున్న రాష్ట్రవాలీబాల్ అకాడమీ అందుబా టులోకి వచ్చింది. ప్రధాన స్టేడి యంలో క్రీడాకారులకు అన్ని క్రీడా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. రూ.6.99 కోట్లతో స్టే డియం మైదానంలో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడి యం మైదానం 2024లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే క్రీడాపాలసీ అమలుతో పాటు రెండేళ్లలో క్రీడలకు రూ.850 కోట్ల బడ్జెట్ కేటాయించారు.
రూ.10.70 కోట్లతో సింథటిక్ ట్రాక్
మహబూబ్‌నగర్ డీఎస్‌ఏ మైదానంలో రూ. 10.70 కోట్లతో 400 మీటర్ల, ఆరు వరుసల సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. సింథటి క్ అథ్లెటిక్స్ ట్రాక్ ఏర్పాటైతే ఔత్సాహిక క్రీ డాకారులకు ఎన్నో మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయి. దీంతో పాటు జాతీయస్థాయి పోటీలు జరిగే అవకాశం ఉం టుంది. రాష్ట్ర అథ్లెటిక్స్ అకాడమీ ఏర్పాటు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పాల మూరు యూనివ ర్సిటీలో సింథటిక్ అందుబాటులోకి వచ్చింది.
అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం...
మహబూబ్‌నగర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకు న్నాం. క్రీడాభివృద్దికి రూ.16.40 కోట్లు మంజూరయ్యాయి. సింథటిక్ ట్రాక్, ఇండోర్‌లో సెంట్రలైజ్డ్ ఏపీ, ఇండోర్‌జిమ్, స్కేటింగ్‌రింగ్ ఏర్పాటుతో పాటు నియోజవర్గంలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తాం. మరో క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది.
- యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
జిల్లాలో క్రీడాభివృద్ధి..
సీఎం రేవంత్‌రెడ్డి, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడా సలహాదారుడు ఏపీ జి తేందర్‌రెడ్డి, స్పోర్ట్స్ అఽథారిటీ చైర్మన్ శివాసేనారెడ్డి జిల్లాకు చెందిన వారు కావటం మన అ దృష్టం. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి క్రికెట్ క్రీడాకారుడు, వీరి సహకరంతో జిల్లాలో క్రీడాభివృద్ధి జరుగుతుంది.
- ఎన్పీ వెంకటేశ్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు
ప్రజాప్రతినిధుల కృషి వల్లే..
మహబూబ్‌నగర్ నియోజవర్గంలో క్రీడాభివృద్ధి రూ.16.40 కోట్ల నిధులకు సంబంధించి జీవో వచ్చింది. ఇందుకు ప్రభుత్వ క్రీడా సలహాదారుడు ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా స్‌రెడ్డి కృషి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.
- ఎస్. శీనివాస్. డీవైఎస్‌వో, మహబూబ్‌నగర్
సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలి..
ప్రధాన స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే స్టేడియంలో ఎన్నో క్రీడావసతులు ఉన్నాయి. ఇక్కడ సింథటిక్ ట్రాక్ లేక జిల్లా అథ్లెట్లు హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి ట్రాక్ ఏర్పాటుకు కృషి చేయాలి. జీవో రావటం సంతోషంగా ఉంది.
- శరత్‌చంద్ర, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి