నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:36 AM
రాజీవ్ గృహకల్పలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) జిల్లా కా ర్యదర్శి ఏ లక్ష్మి డిమాండ్ చేశారు.
వనపర్తి టౌన్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాజీవ్ గృహకల్పలో నెలకొన్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) జిల్లా కా ర్యదర్శి ఏ లక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం జి ల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న ప్రజల సమస్యలపై ఐద్వా సంఘం సభ్యులు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీవ్ గృహకల్పలో నీటి సమస్యతో పాటు డ్రైనేజీ నుంచి వస్తున్న దు ర్వాసన స్థానికులను ఇబ్బంది పెడుతుందన్నా రు. 120 కుటుంబాలకు రాజీవ్ గృహకల్పలో ఇ ళ్లు కేటాయిస్తే కేవలం 45 కుటుంబాలు మాత్ర మే నివాసం ఉంటున్నాయన్నారు. అధికారులు సౌకర్యాలు కల్పించకపోవడంతో చాలా మంది ఇతర ప్రదేశాల్లో అద్దెకు ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గద్వాల సాయిలీల, కవిత, శాం తమ్మ, లలిత, రాజీవ్‌గృహకల్ప కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.