మార్కెట్‌లో నూతన సందడి
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:57 PM
జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 2026 నూతన సంవ త్సర వేడుకల సందడినెలకొంది.
గద్వాల టౌన్/ఎర్రవల్లి/మానవపాడు/ అయిజ/ అలంపూర్, డిసెంబరు 31 (ఆంధ్ర జ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా 2026 నూతన సంవ త్సర వేడుకల సందడినెలకొంది. రంగులు, పతంగులు, కేకుల కొనుగోలుతో బుధవారం మార్కెట్ కళకళలాడింది. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా కేక్ కౌంటర్లను ఏర్పాటు చేసి విక్ర యాలు సాగించారు. ఎర్రవల్లి చౌరస్తాలో మటన్ షాపులు, మద్యం దుకాణాలు, బేకరీల వద్ద రద్దీ కనిపించింది. అలంపూర్‌లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు, పలువురు ప్రజా ప్రతినిధులు కేక్ కట్ చేసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయిజలో గుం తరామేశ్వర, మిట్లరామేశ్వర, స్వయంభు కట్టకింద వేంకటేశ్వర, సాయి, అయ్యప్ప, తిక్కవీరేశ్వరస్వామి ఆలయాలను రంగురంగుల విద్యుద్ధీపాలతో అలంకరించారు.