కాకాకు ఘన నివాళి
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:27 PM
కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి వర్ధంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవా రం స్వర్గీయ జి.వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ శ్రీనివాసరావు ఘనంగా నివాళి అర్పించారు.
గద్వాల క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి వర్ధంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవా రం స్వర్గీయ జి.వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్పీ శ్రీనివాసరావు ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జి.వెంకటస్వామి ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా చేసుకొని కార్మిక వర్గాలు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితభావంతో సేవలందించారన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శంకర్, ఏఆర్ డీఎస్పీ నరేందర్‌రావు, ఏవో సతీష్‌కుమార్, గద్వాల, అలంపూర్ సీఐలు శ్రీను, రవిబాబు, ఆర్‌ఐ వెంకటేష్, ఐటీసెల్ ఎస్‌ఐ షుకూర్, డీసీఆర్బీ ఎస్‌ఐ స్వాతి, భరోసా సెంటర్ ఎస్‌ఐ తారక, సిబ్బంది ఉన్నారు.
పదో బెటాలియన్‌లో..
ఎర్రవల్లి : పేదల కోసం మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని పదో బెటాలియన్ కమాండెంట్ జయరాజ్ అన్నారు. సోమవారం బెటాలియన్‌లో నిర్వహిం చిన కార్యక్రమంలో గడ్డం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఎర్రవల్లి పటాలంలో ఉన్న సాయుధ చైతన్య పాఠశాల రామానుజన్ జయంతి వేడుకల్లో కమాండెంట్ పాల్గొన్నారు. విద్యార్థులకు గణితశాస్త్రంపై ఆసక్తి పెంచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ షాషవలి ఉన్నారు.