కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి
ABN , Publish Date - Sep 21 , 2025 | 11:17 PM
తెలంగాణ ఏర్పాటు కోసం పరితపించిన ప్రముఖుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతరాములు అన్నారు.
పాలమూరు/జడ్చర్ల, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ ఏర్పాటు కోసం పరితపించిన ప్రముఖుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరని పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు అనంతరాములు అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయం, మార్కండేయ ఆలయం, పద్మావతి కాలనీ గ్రీన్‌బెల్ట్ ఏరియాలో గల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏనాడు పదవుల కోసం పాకులాడకుండా నీతి, నిజాయితీతో తెలంగాణ కోసం పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో వెంకటేష్, సూర్యప్రతాప్, సుకుమా, కిషోర్, భీంపల్లి శ్రీకాంత్, బోగం శివాజీ, బాలకృష్ణ, కొంగరి వెంకటేష్, రాఘవేందర్, నరేష్, కోడి రాజశేఖర్ పాల్గొన్నారు. జడ్చర్లలో బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో మండల వనరుల కేంద్రం ఆవరణలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణయాదవ్, సభ్యులు జహంగీర్, విజయ్‌కుమార్, రాధాకృష్ణ, రాఘవేందర్, గోబ్రానాయక్, జానీ, జములయ్య పాల్గొన్నారు.