భారీ వినాయకుడికి ఘనంగా శోభాయాత్ర
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:10 PM
గద్వాలలోని వివిధ వార్డులో ప్ర తిష్ఠించిన గణనాథులను గురువారం రాత్రి నిర్వాహకులు నిమజ్జనానికి తరలించారు.
గద్వాల సర్కిల్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గద్వాలలోని వివిధ వార్డులో ప్ర తిష్ఠించిన గణనాథులను గురువారం రాత్రి నిర్వాహకులు నిమజ్జనానికి తరలించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బ్యాండ్, భజంత్రీలు, డీజే శబ్దాల మధ్య ప్రధాన మార్గాల మీదుగా శోభాయాత్ర సాగింది. ప్రధానంగా భీంనగర్‌లో ఆకార్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన 22 అడుగుల వినాయక విగ్రహాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల సందర్శన కోసం రెండు గంటలకు పైగా విగ్రహాన్ని కృష్ణవేణిచౌరస్తా వద్ద నిలిపారు. వివిధ ప్రాంతాల కళాకారుల నృత్యప్రదర్శన, చిన్నారుల కోలాటం, ప్రత్యేక బృందం ప్రదర్శించిన డప్పు వాయిద్యం ఆకట్టుకుంది. పలువురు ఔత్సాహికులు 22అడుగుల గణనాథుని విగ్రహం, పులివేషధారణ కళాకారులతో సెల్ఫీలు దిగారు.