Share News

సర్పంచు, వార్డు సభ్యులకు ఘన సన్మానం

ABN , Publish Date - Dec 12 , 2025 | 11:53 PM

మండ ల పరిధిలోని మాచర్ల గ్రామ సర్పంచ్‌ ఫలితం రాత్రి 12గంటలకు వెలువడింది.

సర్పంచు, వార్డు సభ్యులకు ఘన సన్మానం
మాచర్లలో సర్పంచు, వార్ఢు సభ్యులను సన్మానిస్తున్న మాచర్ల గ్రామస్థులు

గట్టు, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండ ల పరిధిలోని మాచర్ల గ్రామ సర్పంచ్‌ ఫలితం రాత్రి 12గంటలకు వెలువడింది. వార్డుల కౌం టింగ్‌ అనంతరం సర్పంచ్‌ అభ్యర్థి కౌంటింగ్‌ను మొదలు పెట్టారు. మండలంలోని 20 గ్రామాల ఫలితాలు రాత్రి 9గంటల కల్లా పూర్తి అయ్యా యి. కానీ మాచర్ల ఫలితం మాత్రం ఆలస్యం అయింది. గ్రామంలో ఆరుగురు మహిళా అభ్య ర్థులు పోటీలో ఉండగా ఉమ్మడి అభ్యర్థి బుడకల వజ్రమ్మ 173 ఓట్లతో విజయం సాదించిం ది. దీంతో గ్రామస్థులు సంబరాలు నిర్వహించుకున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌ బుడకల వజ్రమ్మతో పాటు వార్డు సభ్యులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు వెంకటస్వామి గౌడు, మాజీ సర్పంచ్‌ వరలక్ష్మీ, నీలకంఠం, మాజీ సర్పంచ్‌ తిమ్పప్ప, పీజీ శివప్పలు ఘనంగా సన్మానించారు.

Updated Date - Dec 12 , 2025 | 11:53 PM