Share News

వైభవంగా రథోత్సవం

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:03 AM

జోగుళాంబ గద్వా ల జిల్లా కేంద్రంలో గల భీంనగర్‌లో వెలసిన సంతాన వేణుగోపాలస్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెం డవ రోజు గురువారం రాత్రి ర థోత్సవాన్ని వైభవంగా నిర్వహిచా రు.

వైభవంగా రథోత్సవం
రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

గద్వాల టౌన్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : జోగుళాంబ గద్వా ల జిల్లా కేంద్రంలో గల భీంనగర్‌లో వెలసిన సంతాన వేణుగోపాలస్వా మి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెం డవ రోజు గురువారం రాత్రి ర థోత్సవాన్ని వైభవంగా నిర్వహిచారు. అంతకుపూర్వం ఆలయంలో ఉ దయం స్వామివారికి అర్చన, అలం కార సేవ, నిత్యహోమం పూర్తి చే యగా, రథం వద్ద రాజవంశీయులు వెంకటాద్రి రెడ్డి, ఉషారాణి దంప తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం నుంచి ప్రారం భమైన రథోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కాగా, ఆ లయం నుంచి ప్రారంభమైన రథోత్సవం అంబేడ్కర్‌ సర్కిల్‌, కృష్ణవేణి చౌరస్తా నుంచి తిరిగి ఆలయం చేరింది. అనంతరం స్వామివారికి సంప్రదాయబద్ధమైన ఊంజల్‌ సేవ నిర్వహించారు.

Updated Date - Dec 12 , 2025 | 12:03 AM