Share News

పర్యాటకులకు కనువిందు చేసిన పెద్దపులి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:14 PM

అమ్రాబాద్‌ జంగల్‌ సఫారీ ప ర్యాటకులకు సోమవారం ఉదయం పెద్దపులి కనువిందు చేసింది.

పర్యాటకులకు కనువిందు చేసిన పెద్దపులి
సోమవారం ఉదయం నిజాం బంగ్లా వద్ద అడవిలో సంచరిస్తున్న పెద్దపులి

మన్ననూర్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): అమ్రాబాద్‌ జంగల్‌ సఫారీ ప ర్యాటకులకు సోమవారం ఉదయం పెద్దపులి కనువిందు చేసింది. అక్టోబ రు 1 నుంచి టైగర్‌ సఫారీ ప్రారంభించడంతో పర్యాటకులు నల్లమల సం దర్శనకు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన పర్యాటకులు ఫర్హాబాద్‌ చౌరస్తా నుంచి వ్యూ పా యింట్‌కు సఫారీ వాహనంలో వెళ్తుండగా నిజాం బంగ్లా (షికార్‌ఘర్‌) వద్ద మట్టి రోడ్డుపై పెద్దపులి కనపించింది. దీంతో డ్రైవర్‌ సఫారీ వాహనాన్ని నిలిపివేశాడు. పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలను పర్యాటకులు వారి సెల్‌ ఫోన్‌లలో వీడియోలు తీస్తూ సంబురపడ్డారు. అదే పర్యాటకులకు సాయం త్రం కూడా పెద్దపులి కనిపించిట్లు అమ్రాబాద్‌ అటవీ డివిజన్‌ అధికారి (ఎఫ్‌డీఓ) రామమూర్తి ధ్రువీకరించారు.

Updated Date - Oct 06 , 2025 | 11:14 PM