రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలి
ABN , Publish Date - Jul 26 , 2025 | 11:28 PM
శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో షా ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన నాల్గవ యూ నిట్‌కు నేటికి వినియోగంలోకి రాకపోవడానికి గల కారణాలపై రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వా లని హెచ్‌పీసీ (హైడల్ ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్) డిపా ర్ట్‌మెంట్ అధికారులను ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు.
- ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, జెన్‌కో సీఎండీ హరీశ్
బ్రహ్మగిరి, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో షా ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైన నాల్గవ యూ నిట్‌కు నేటికి వినియోగంలోకి రాకపోవడానికి గల కారణాలపై రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వా లని హెచ్‌పీసీ (హైడల్ ప్రాజెక్టు కన్‌స్ట్రక్షన్) డిపా ర్ట్‌మెంట్ అధికారులను ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శనివారం జెన్‌కో సీఎండీ హరీశ్, హైడల్ ప్రాజెక్టు డెరెక్టర్ పిల్లి బాలరాజుతో కలిసి ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో పాడైన నాల్గవ యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం జెన్‌కో సీఈ కేవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రంలో జెన్‌కో ఇంజనీర్లు, వాయిత్ కంపెనీ ఇంజనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాదం జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్నా నాల్గవ యూనిట్ పునరుద్ధరణ చేయక పోవడం అలసత్వం ఏంటనీ ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మండిపడ్డారు. 2023లో మరోసారి యూనిట్‌లో షాట్ సర్క్యూట్ గల కార ణాలు, వాయిత్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన గడు వు ఏప్రిల్ నాటికి పూర్తి కావలసిన పనులు ఎందుకు జాప్యం జరిగిందని జెన్ కో అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఐదు సం వత్సరాలు యూనిట్ పనిచేయక పోవడం వలన కలిగిన లాభా నష్టాలపై పూర్తి నివేదిక సిద్ధం చేయాలని హైడల్ డిపార్ట్‌మెంట్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు చివరివరకు నాల్గవ యూనిట్ మరమ్మతుల పనులు నాణ్యతగా సకాలంలో పూర్తి చేయాలని వాయిత్ కంపెనీ ఇంజ నీర్లను ఆదేశించారు. ఒకటో యూనిట్‌లో డ్రాఫ్ట్ ట్యూబ్‌లో వాటర్ లీకేజీపై ఆరా తీశారు. ఎస్‌ఈలు ఆదినా రాయణ, రవింద్రకుమార్, ఇంజనీర్లు పాల్గొన్నారు.