Share News

డ్రగ్స్‌ రహిత సమాజమే అందరి లక్ష్యం

ABN , Publish Date - Nov 21 , 2025 | 10:59 PM

డ్రగ్స్‌, గంజాయి రహిత సమాజం ని ర్మించడం మనందరి బాధ్యత అని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రం లోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో విశ్వ హిందూ పరి షత్‌, బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమానికి ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ హాజరయ్యారు.

 డ్రగ్స్‌ రహిత సమాజమే అందరి లక్ష్యం
భరతమాత చిత్రపటానికి పూజలు చేసిన ఎస్పీ డాక్టర్‌ వినీత్‌

- ఎస్పీ డాక్టర్‌ వినీత్‌

నారాయణపేట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : డ్రగ్స్‌, గంజాయి రహిత సమాజం నిర్మించడం మనందరి బాధ్యత అని ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రం లోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో విశ్వ హిందూ పరి షత్‌, బజరంగ్‌ దళ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమానికి ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ముందుగా భరతమాత చిత్రపటానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు, యువతకు డ్రగ్స్‌, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ఫ్రభావాలు, వాటి నియంత్రణపై సమగ్ర అవగాహన కల్పి స్తూ ప్రొజెక్టర్‌ ద్వారా షార్ట్‌ ఫిలీం వీడియోస్‌ ప్లే చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ.. నార్కోటి డ్రగ్‌ అనేది ఒక టెర్రరిస్టు లాంటిదని, దేశం మొత్తం నాశనం చేస్తుంద ని తెలిపారు. ఎవరైనా గం జాయి, డ్రగ్స్‌ అక్రమ రవా ణా, విక్రయం లేదా విని యోగం చేస్తూ కనిపించిన ట్లయితే 1908 టోల్‌ ఫ్రీ నెంబర్‌ లేదా డయల్‌ 100 కు వెంటనే సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వ్యక్తిగత వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతామ న్నారు. పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రాజశేఖర్‌, సీఐ శివశంకర్‌, ఎస్‌ఐలు వెంకటేశ్వ ర్లు, సునీత, బజరంగ్‌దళ్‌ అధ్యక్షుడు వడ్ల శ్రవ ణ్‌, కార్యదర్శి కన్న శివకుమార్‌, నగర అ ధ్యక్షుడు మురళి బట్టడ్‌, ఏబీవీపీ కన్వీనర్‌ నరేష్‌, వెంకటరమణ, వెంకటేశ్‌, ఆకాశ్‌, ఉ పాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పా ల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2025 | 10:59 PM