‘ఉపాధి హామీని నిర్వీర్యం చేసే కుట్ర’
ABN , Publish Date - May 08 , 2025 | 11:49 PM
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టా నికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పోడు స్తూ.. ఎత్తివేసే కుట్ర చేస్తుందని సీ పీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనే యులు అన్నారు.
వీపనగండ్ల, మే 8, (ఆంధ్రజ్యోతి) : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టా నికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పోడు స్తూ.. ఎత్తివేసే కుట్ర చేస్తుందని సీ పీఎం జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనే యులు అన్నారు. గురువారం మండ ల పరిధిలోని సంగినేనిపల్లి గ్రామంలో ఉపాఽధి పనులు జరుగుతున్న ప్రదేశా న్ని సందర్శించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ఉపాఽధి కూలీలకు సమ్మర్ అలవెన్సు కనీస సౌకర్యాలు ఎత్తివేసిందన్నారు. ఈ కార్యక్ర మంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్య దర్శి ఆంజనేయులు, కూలీలు రాజు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.