సంప్రదాయాన్ని ప్రతిబింబించే సంబురం
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:49 PM
బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, మన సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
గద్వాల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పూజచేసి ఉత్సవాన్ని ప్రారంభించిన కలెక్టర్
గద్వాల న్యూటౌన్, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, మన సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడీవోసీ ఆవరణలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గౌరీ పూజ నిర్వహించి, బతుకమ్మ వేడులకను అధికారులతో కలిసి ప్రా రంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ శాఖల రంగురంగుల బతుకమ్మలతో ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. బతుకమ్మ వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తూ బతుకమ్మ పండుగ సందర్బంగా ప్రజల బతుకులు బాగుండాలని గౌరమ్మతల్లిని వేడుకుందామన్నారు. మన పండుగ, మన సం స్కృతీ ఈ బతుకమ్మ అని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పూలను పూజించి ప్రకృతిని ప్రేమించే ఏకైక పండుగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ పండుగ మన వారసత్వాన్ని కాపాడే గొప్ప పండుగ అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు, ఆర్డీవో అలివేలు, వివిధ శాఖల అధికారులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.