Share News

దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలి

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:50 PM

జిల్లాలోని పాగుంట గ్రామంలో అకారణంగా ర జకులపై దాడి చేసి మహిళలను అసభ్య పద జాలంతో దూషించిన గ్రామం పెత్తందారులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తె లంగాణ రజక వృత్తిదారుల సంఘం(టీఆర్‌వీ ఎస్‌) రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్‌ చేశారు.

దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలి

  • టీఆర్‌వీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య

  • బాధితులకు పరామర్శ, డీఎస్పీకి ఫిర్యాదు

గద్వాల టౌన్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పాగుంట గ్రామంలో అకారణంగా ర జకులపై దాడి చేసి మహిళలను అసభ్య పద జాలంతో దూషించిన గ్రామం పెత్తందారులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తె లంగాణ రజక వృత్తిదారుల సంఘం(టీఆర్‌వీ ఎస్‌) రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య డిమాండ్‌ చేశారు. దాడి జరిగి నాలుగరోజులు దాటినా నిందుతులపై కేసు నమోదు చేయకపోవడం విచారకరమన్నారు. దాడికి నిరసనగా ఆదివా రం పట్టణంలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద సీఐ టీయూ నాయకులు, టీఆర్‌వీఎస్‌ బాధితులుతో కలిసి ఆందోళన నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడిన ఆశయ్య, ఆగస్టు 31వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన రజక దేవేంద్రప్ప ఇంటిపై ఖాళీ సీసాలు, రాళ్ల దాడి చేసిన నిందితులు మ రుసటి రోజు తామే గ్రామ ఆలయం వద్ద పం చాయతీ పెట్టారన్నారు. అక్కడికి వెళుతుండగా నే రమేశ్‌, వీరేశ్‌, నత్తి రంగస్వామి, బోండం వీరేశ్‌, చిన్న వీరేశ్‌ మరికొంత మంది బోయిల గూడెం గ్రామానికి చెందిన వారితో కలిసి కట్టెల తో మూకుమ్మడిగా దాడి చేయగా దేవేంద్రప్ప, ఆయన కుమారుడు ప్రవీణ్‌కుమార్‌లకు గా యాలయ్యాయన్నారు. కాగా, గాయపడి చికిత్స పొందుతున్న తండ్రి, కొడుకులను బీఆర్‌వీఎస్‌, సీఐటీయూ నాయకులు పరామర్శించారు. అనం తరం జిల్లా రజన సంఘం నాయకులతో కలిసి డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ వీఎస్‌ జిల్లా కన్వీనర్‌ నరసింహ, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నపాటి నరసింహుడు, నాయకులు ఉప్పేరు అంజి, నరసింహ, మద్దిలేటి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు ఉప్పే రు నరసింహ, నాగరాజు, రాము, వీరేశ్‌, రాముడు ఉన్నారు.

Updated Date - Sep 07 , 2025 | 11:50 PM