యువకుడి దారుణ హత్య
ABN , Publish Date - Nov 13 , 2025 | 11:18 PM
ఏ తగాదాలు ఉన్నాయో తెలి యదు కానీ ఓ యువకుడి (28)ని హత్య చేసి దుండగులు తగులబెట్టి హత్య చే శారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలోని యన్మనగండ్ల గేట్ సమీపంలో గురువారం తెల్లవారు
నవాబ్‌పేట, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఏ తగాదాలు ఉన్నాయో తెలి యదు కానీ ఓ యువకుడి (28)ని హత్య చేసి దుండగులు తగులబెట్టి హత్య చే శారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట మండలంలోని యన్మనగండ్ల గేట్ సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గాండ్ల శివయ్యకు సంబంధించిన పొలంలో తగులబెట్టిన మృతదేహం ఆ యన దగ్గర పని చేసే చంద్రయ్యకు కనిపించింది. వెంటనె తన యజమాని, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఎస్‌ఐ విక్రం సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృత దేహాన్ని పరిశీలించి ఆనవాళ్లు సేకరించారు. అనంతరం మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు చేరుకుని క్లూస్‌టీం సీఐ రవికుమార్, జాగిలాన్ని రప్పించారు. రాత్రి కావడంతో జిల్లా ఆసుపత్రికి తర లించారు. మృతుడు మహబూబ్‌నగర్‌కు చెందినవాడిగా పోలీసులు అనుమా నిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైనట్లు తెలియడంతో పోలీసులు ఆఽ దిశగా విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.