Share News

పట్టుకుంటుండగా కాటేసిన రక్తపింజరి

ABN , Publish Date - Nov 19 , 2025 | 11:44 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వేంకటశ్వర కాలనీలో మంగళవా రం రాత్రి ఇంటి ముందుకు రక్తపింజరి వచ్చింది.

పట్టుకుంటుండగా కాటేసిన రక్తపింజరి

- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్నేక్‌ క్యాచర్‌ను పరామర్శించిన మునిసిపల్‌ చైర్మన్‌

అచ్చంపేటటౌన్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలోని వేంకటశ్వర కాలనీలో మంగళవా రం రాత్రి ఇంటి ముందుకు రక్తపింజరి వచ్చింది. దీంతో యజమా ని స్నేక్‌ క్యాచర్‌ సుమన్‌కు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరు కున్న సుమన్‌ రక్తపింజరిని పట్టే క్రమంలో అది కాటు వేసింది. వెంటనే ఆయన పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా, వైద్యు లు చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న మునిసిపల్‌ చైర్మ న్‌ శ్రీనివాసులు, వార్డు కౌన్సిలర్‌ సునితా రెడ్డి, ఆసుపత్రికి వెళ్లి సుమన్‌ను పరామర్శించారు.

Updated Date - Nov 19 , 2025 | 11:44 PM