Share News

పేదల సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Aug 11 , 2025 | 11:29 PM

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపా ధి కల్పన, గనులశాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి అన్నారు.

పేదల సంక్షేమానికి పెద్దపీట
మునిసిపల్‌ భవనాన్ని ప్రారంభిస్తున్న మంత్రి వివేక్‌ వెంకటస్వామి

- రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి

అచ్చంపేట ఆగస్టు, 11 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపా ధి కల్పన, గనులశాఖ మంత్రి డాక్టర్‌ వివేక్‌ వెంకటస్వామి అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలో రూ.3 కోట్లతో నిర్మించిన మునిసిపల్‌ కార్యాలయ భవనాన్ని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజేశ్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌లతో కలిసి ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోనే ఇంత సుందరమైన మునిసిపల్‌ భవనాన్ని ప్రారం భిచడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్థానిక ఎమ్మెల్యే కృషితోనే ఇంతటి గొప్ప భవనాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. ప్రతీ నివాసానికి శుద్ధమైన తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో మురు గు కాల్వలను తప్పకుండా శుభ్రం చేయాలని సూచించారు. అనంతరం బల్మూరు మండలం లోని కొండనాగుల గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహా న్ని ఆవిష్కరించారు. గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంబేడ్క ర్‌ సూచించిన మార్గంలో నేటి యువత పయ నించాలన్నారు. విద్య, ఉద్యోగ ఉపాధి అవ కాశా లతో యువత ముందువరుసలో ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ రావులగిరిధర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ శ్రీని వాసులు, కమిషనర్‌ మురళీ, సమత సైనికదళ్‌ అధ్యక్షుడు రెంజర్లరాజేష్‌, నాయకులు ఉన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 11:30 PM