క్రీడాభివృద్ధికి పెద్దపీట
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:26 PM
క్రీడాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఒలింపిక్ సం ఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో రాష్ట్రస్థాయి జూనియర్ నెట్‌బాల్ టోర్నీని నిర్వహిస్తున్నారు.
ఒలింపిక్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్‌పీ వెకంటేశ్
అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్రస్థాయి జూనియర్ నెట్‌బాల్ టోర్నీ
బాల బాలికల విభాగాల్లో మహబూబ్‌నగర్ శుభారంభం
28 జిల్లాల నుంచి పాల్గొన్న 1,200 మంది క్రీడాకారులు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): క్రీడాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఒలింపిక్ సం ఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్‌పీ వెంకటేశ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్టేడియం మైదానంలో రాష్ట్రస్థాయి జూనియర్ నెట్‌బాల్ టోర్నీని నిర్వహిస్తున్నారు. పోటీలను వెంకటేశ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా మైదానం అభివృద్ధికి రూ.16 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ మంజూరు చేసిందని, సింథటిక్ ట్రాక్‌తో పాటు ఇండోర్ స్టేడియంంలో సెంట్రలైజ్డ్ ఏసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని చాటాలని చెప్పారు. టోర్నీలో 28 జిల్లాల నుంచి 1,200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ట్రెడిషనల్, ఫస్ట్-5, మిక్స్‌డ్ మూడు విభాగాల్లో పోటీలు జరిగాయి. అనంతరం భారత జట్టుకు ఆడిన యశశ్రీ, లితిషలను ఘనంగా సన్మాంచారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు విక్రమాదిత్యరెడ్డి, కార్యదర్శి శిరిషరాణి, అసోసియేషన్ ప్రతినిధులు ఖాజాఖాన్, రాంమోహన్, అంజద్‌అలీ, షరీఫ్, అక్రమ్, రాజరాం పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ జట్టు శుభారంభం..
రాష్ట్ర స్థాయి జూనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షి్‌ప పోటీలు ఉత్సహంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు పోటీలు నిర్వహించనున్నారు. బాలురు విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు 16-1 పాయింట్ల తేడాతో పెద్దపల్లి జట్టుపై, 15-9 పాయింట్లతో తేడాతో సిరిసిల్లపై శుభారంభం చేసింది. వనపర్తి జట్టు 7-1 తేడాతో వరంగల్‌పై, నల్గొండ 14-1 తేడాతో ఆదిలాబాద్‌పై, ఖమ్మం 16-5 తేడాతో ఆసిఫాబాద్‌పై, మహబూబాబాద్ 15-7 తేడాతో నిజామాబాద్‌పై గెలుపొందాయి. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జట్టు 5-1 పాయింట్ల తేడాతో సిరిసిల్లపై, 9-1 తేడాతో వికారాబాద్‌పై గెలిచి శుభారంభం చేసింది. మేడ్చల్ 14-2 తేడాతో ఆదిలాబాద్‌పై, నల్గొండ 12-4 తేడాతో వరంగల్‌పై, హైదరాబాద్ 4-2 తేడాతో మెదక్‌పై, కామారెడ్డి 4-1 తేడాతో నారాయణపేటపై, కరీంనగర్ 6-2 తేడాతో జనగాంపై, రంగారెడ్డి 9-7 తేడాతో వనపర్తిపై, మేడ్చల్ 6-1 తేడాతో పెద్దపల్లిపై, ఖమ్మం 14-2 తేడాతో మహబూబాబాద్‌పై గెలుపొందాయి. హైదరాబాద్ జట్టు 10-1 తేడాతో నిర్మల్‌పై, నాగర్‌కర్నూల్ 6-3 తేడాతో కామారెడ్డిపై, నిజామాబాద్ 8-5 తేడాతో కరీంనగర్‌పై, ఆసీఫబాద్ 10-9 తేడాతో గద్వాలపై, జగిత్వాల 6-1 తేడాతో మంచిర్యాలపై, భద్రాద్రి కొత్తగూడెం 5-2 తేడాతో వరంగల్‌పై విజయం సాధించాయి.