Share News

విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట

ABN , Publish Date - Jul 10 , 2025 | 11:47 PM

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా పాలనలో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు.

విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి

- నేడు వైద్య కళాశాల నూతన భవన ప్రారంభోత్సవం

- 550 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన

- హాజరుకానున్న ముగ్గురు మంత్రులు

నాగర్‌కర్నూల్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజా పాలనలో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి అన్నారు. మెడికల్‌ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. వైద్య కళాశాల నూతన భవనాన్ని శుక్రవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే రూ. 235 కోట్ల వ్యయంతో 550 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావులు హాజరు కానున్నారని తెలిపారు. తూడుకుర్తిలో రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. రూ. 9 కోట్ల వ్యయంతో ప్రభుత్వ జూని యర్‌ కళాశాల భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. జిల్లా ఆసుపత్రి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న ఆసుపత్రిని మాతా, శిశు సంక్షేమ కేంద్రంగా మారుస్తామని తెలిపారు. వార్డుల వారీగా 8 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయిం చామని, ఇందుకు అవసరమైన వనరులను సమకూర్చాలని మునిసి పల్‌ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రమాదేవి, మార్కెట్‌ చైర్మన్‌ రమణా రావు, నాయకులు సునేంద్ర, జక్కా రాజు, నిజాం, ఖాదర్‌, నరేందర్‌, తెలకపల్లి పర్వతాలు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 11:47 PM