ఘనంగా పాల ఉట్లు
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:19 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం పాల ఉట్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి ఉత్సవాల్లో భాగంగా నిర్వహణ
ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు
మంత్రి ప్రత్యేక పూజలు
మక్తల్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మక్తల్ పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం పాల ఉట్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు స్వామివారి ఉత్సవ మూర్తిని ఆలయం నుంచి రాంలీలా మైదానం వరకు ఊరేగించి, పూజలు చేశారు. అనంతరం ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 20 నిమిషాలపాటు యువకులు పైకి ఎగబాకుతూ, కిందకు జారుతూ ఉట్లు కొట్టారు. అంతకు ముందు తెల్లవారుజామున మంత్రి వాకిటి శ్రీహరి కోనేరులో స్నానం చేశారు. కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారీ, ఈవో కవిత, ఆలయ సిబ్బంది కుమ్మరి శ్రీనివాసులు, రజినీకాంత్, సత్యనారాయణ, వివిధ పార్టీల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.