Share News

వ్యవసాయానికి పెద్దపీట

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:13 PM

రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో రైతును రాజును చేయాలని వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌ సమీకృత భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వ్యవసాయానికి పెద్దపీట
కలెక్టరేట్‌ వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

మహిళా సాధికారత కోసం కృషి

తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌

పేదల సంక్షేమం.. సుపరిపాలనే లక్ష్యం

నేటినుంచి 20 వరకు అన్ని గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు

జిల్లాకు ట్రిపుల్‌ఐటీ, నవోదయ విద్యాలయాలు మంజూరు

రాష్ట్ర అవతరణ దినోత్సవంలో మంత్రి జూపల్లి

మహబూబ్‌నగర్‌, జూన్‌2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వంలో రైతును రాజును చేయాలని వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టరేట్‌ సమీకృత భవనం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి, కలెక్టర్‌ విజయేందిరబోయి, ఎస్పీ జానకిలతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జూపల్లి మాట్లాడారు. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్‌తో ముందుకెళ్తున్నామన్నారు. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపపకల్పన, ప్రపంచస్థాయి ఇన్‌ఫ్రా డెవల్‌పమెంట్‌, పారదర్శక పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్‌కు 2.50 లక్షల మంది రైతులకు రూ.250.78 కోట్లు కేటాయించామన్నారు. ఇప్పటివరకు 1.88 లక్షల మందికి రూ.158.16 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. పంట రుణమాఫీ ద్వారా జిల్లాలో 76,385 మంది రైతులకు రూ.597 కోట్లు మాఫీ చేయడం జరిగిందన్నారు. ఈ వానా కాలంలో 3.64 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశామన్నారు. ఖరీ్‌ఫలో రైతుల నుంచి 91,855 టన్నుల ధాన్యం సేకరించామని, అందులో 65,659 టన్నుల సన్నాలకు రూ.31.29 కోట్లు బోనస్‌ ఇచ్చామన్నారు. రబీలో 1.37 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గుర్తు చేశారు.

మహిళలకు ప్రోత్సాహం

మహిళాశక్తి ద్వారా కలెక్టరేట్‌, మూసాపేటలో మహిళాశక్తి క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. దేవరకద్ర, బాలానగర్‌ మండలాల్లో మహిళా సంఘాల ద్వారా ఒక్కోటి రూ.4 కోట్ల వ్యయంతో రెం డు సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి త్వరలోనే ప్రారంభించబోతున్నామని చెప్పారు. 7 మండల మహిళా సమాఖ్యల ద్వారా 7 బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీకి అద్దెకు ఇచ్చామన్నారు. జిల్లా కేంద్రంలో మహిళా సంఘాల ద్వారా తొందరలోనే పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

నాణ్యమైన విద్యకు విద్యాలయాలు

నాణ్యమైన విద్య కోసం బాలానగర్‌ మండలం పెద్దాయపల్లి, సీసీకుంట మండలం దమగ్నాపూర్‌లలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చే సుకున్నామన్నారు. మహబూబ్‌నగర్‌ నియోజకవర్గానికి మరో ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల మం జూరైందని చెప్పా రు. జిల్లాకు ఇటీవలే ప్రభుత్వం ట్రిపుల్‌ ఐటీని మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిందని వివరించారు. జవహర్‌ నవోద య విద్యాలయం కూడా పా లమూరు జిల్లాకు మం జూరైందని తెలిపారు. సో మవారం నుంచి 20 వరకు అన్ని గ్రామాలలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. పర్యాటక రం గాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. బ్యాం క్‌ లింకేజీ కింద జిల్లాలోని 130 మహిళా సంఘాలకు రూ.10 కోట్ల రు ణాల చెక్కులను మంత్రి, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. స్త్రీ నిధి కింద మరో రూ.5 కోట్ల రుణాలను అందజేశారు. మహబూబ్‌నగర్‌, దేవరకద్ర, జడ్చర్ల, పరిగి నియోజకవర్గాలకు చెందిన 14 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. వరకు నిర్మాణాలు చేసిన నలుగురు లబ్ధిదారుల కు ఒక్కొక్కరికి రూ.లక్ష చెక్కులను ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్‌, మోహన్‌రావు, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ అ నిత, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:13 PM