Share News

రాష్ట్ర స్థాయికి 8 స్కూల్స్‌

ABN , Publish Date - Dec 02 , 2025 | 11:29 PM

పాఠశాలల్లో స్వచ్ఛత, పచ్చదనమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ పోటీల్లో జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. మొత్తం 1,136 పాఠశాలలు, విద్యా సంస్థలు ఇందులో పాల్గొనగా, 343 పాఠశాలలు నాలుగు, ఐదు స్టార్‌ రేటింగ్‌లు సాధించాయి.

రాష్ట్ర స్థాయికి 8 స్కూల్స్‌
పోటీల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కంచన్‌పల్లి పాఠశాల ఉపాధ్యాయినులు(ఫైల్‌)

స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ పోటీల్లో ఎంపిక

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల్లో స్వచ్ఛత, పచ్చదనమే లక్ష్యంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ ఏవమ్‌ హరిత్‌ విద్యాలయ పోటీల్లో జిల్లాలోని ఎనిమిది పాఠశాలలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి. మొత్తం 1,136 పాఠశాలలు, విద్యా సంస్థలు ఇందులో పాల్గొనగా, 343 పాఠశాలలు నాలుగు, ఐదు స్టార్‌ రేటింగ్‌లు సాధించాయి. అందులో 8 పాఠశాలలు జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చాయి. వివిధ విభాగల్లో మొదటి, రెండవ స్థానంలో నిలిచాయి. ఈ మేరకు వాటిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు సీఎంవో సుధాకర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

రూరల్‌-1లో గండీడ్‌ మండలం కొంరెడ్డిపల్లి మహమ్మదాబాద్‌ మండలం కంచన్‌పల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలు, రాజాపూర్‌ మండలం కల్లెపల్లి మండల పరిషత్‌ పాఠశాలలు ఎంపికయ్యాయి.

రూరల్‌ -2లో జడ్చర్ల మండలం పోలెపల్లి సెజ్‌లోని ఎస్‌వీకేఎం పాఠశాల, గండీడ్‌ మండలం వెన్నచేడ్‌ జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల, భూత్పూర్‌ మండలం తాటికొండ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఎంపికయ్యాయి.

అర్బన్‌-1లో బాదేపల్లి తెలుగువాడ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది.

అర్బన్‌-2లో మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం ఎదిర జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన పాఠశాలలను జాతీయ స్థాయి ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికైతే రూ.లక్ష నగదును అందిస్తారు. ప్రఽధాని మోదీ నుంచి పురస్కారాలు అందుకుంటారు.

Updated Date - Dec 02 , 2025 | 11:29 PM