77 పంచాయతీలు మావే..
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:09 PM
నియోజకవర్గంలో 124 పం చాయతీలలో 77 పంచాయతీలలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అ న్నారు.
- రేవంత్ నాయకత్వానికి సర్పంచుల విజయాలే నిదర్శనం
- గెలిచాక ఒకరు హైదరాబాద్‌లో.. మరొకరు ఏపీలో
- విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్
వడ్డేపల్లి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గత అసెంబ్లీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరు హైదరాబా ద్‌లో.. మరొకరు ఏపీలో ఉండేవారిని గెలిపించు కున్నారని జోగుళాంబ గద్వాల అలంపూరు నియోజకవర్గ ప్రజలను ద్దేశించి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ అ న్నారు. శాంతినగర్‌లో గురువారం కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో న్యాయం జరుగుతుందని ప్రజలు పూర్తిగా నమ్మారని అని, అం దుకే పంచాయతీ ఫలితాలలో స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. నియోజకవర్గంలో 124 పం చాయతీలలో 77 పంచాయతీలలో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారని అన్నారు. ఎర్రవల్లి మినహా అన్నిమండలాల్లో తమదే ఆధిపత్యమని ఇది ఎవరైనా కాదనగలరా అని అన్నారు. ప్రజల మధ్య ఉండేవారిని కాదని ఒక రు హైదరాబాద్‌లో.. మరొకరు ఏపీలో ఉండేవా రిని గెలిపించుకుని నియోజకవర్గ ప్రజలు తప్పు చేశారని, ఆ ఎన్నికల్లో నేను ఓడినా నియోజకవర్గం కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. వారి హయాంలో కట్టి వదిలేసిన వందపడకల ఆసుపత్రిని వినియోగంలో తెచ్చామన్నారు. కాం గ్రెస్ హయాంలోనే పల్లెలు అభివృద్ధి చెందుతా యని అన్నారు. కార్యక్రమంలో అయిజ షేక్షావలిఆచారి, ఇస్మాయిల్, రాజోలి నూతన సర్పంచి గిడ్డారెడ్డి, జల్లాపూరం వెంకటేశ్వర్లు, క్యాతూరు మద్దిలేటి, ప్రాగటూరు గోపాల్, నూతన సర్పంచులు సురేష్‌గౌడు, మద్దిలేటి, రామకృష్ణ, మధు, పారిజాత ఉన్నారు.