Share News

శ్రీశైలం ప్రాజెక్టులో 51 టీఎంసీల నీరు

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:34 PM

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతుండటంతో ఇన్‌ఫ్లోలు స్వల్పంగా పెరిగాయి.

శ్రీశైలం ప్రాజెక్టులో  51 టీఎంసీల నీరు

- 17 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో

దోమలపెంట, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లా సరిహద్దులో ఉన్న శ్రీశైలం జలాశయంలో 51.9634 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు గేజింగ్‌ అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు ఎగువనున్న సుంకేసుల నుంచి 2,231 క్యూసెక్కులు, జూరాల ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పాదనతో 22,987 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం 30,218 క్యూసెక్కుల నీరు దిగువకు వస్తుండగా, శ్రీశైలం ప్రాజెక్టులోకి 17,055 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ఎంజీకేఎల్‌ఐ కాల్వకు నీటిని తరలింపును నిలిపివేశారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడగులకు గాను, సోమవారం 832.30 అ డుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను 51.9634 టీఎంసీల నీటి నిల్వ నమోదు అవుతోందని అధికారులు తెలిపారు. కుడి, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగడం లేదు.

జూరాలకు నిలకడగా వరద..

ధరూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద స్థిరంగా కొనసాగుతుండటంతో ఇన్‌ఫ్లోలు స్వల్పంగా పెరిగాయి. ఎగువనున్న ఆల్మటి జలాశయంలో 54.02 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకోగా, ఆ ప్రాజెక్టు దిగువన ఉన్న నారాయణపూర్‌ జలా శయంలో 27.21 టీఎంసీలకు నీటి నిల్వ చేరకున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయంలో 317.990 మీటర్లలో 4.884 టీఎంసీల నీరు ఉన్నది. ప్రాజెక్టుకు 24 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, జలవిద్యుత్‌ కేంద్రానికి 27,987 క్యూసెక్కుల నీటిని వి డుదల చేస్తూ మూడు యూనిట్ల ద్వారా 160 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలను నిలిపివేసిన అధికారులు నెట్టెంపాడు లిఫ్ట్‌ కెనాల్‌కు 750 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 28,804 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.

Updated Date - Jun 02 , 2025 | 11:34 PM