Share News

తెరుచుకున్న సరళాసాగర్‌ 5 గేట్లు

ABN , Publish Date - Aug 18 , 2025 | 11:14 PM

వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు ఆటోమెటిక్‌ సైఫన్లు సోమవారం 5 తెరుచుకున్నాయి.

తెరుచుకున్న సరళాసాగర్‌ 5 గేట్లు
సరళాసాగర్‌ 5 గేట్ల నుంచి విడుదలవుతున్న నీరు

మదనాపురం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు ఆటోమెటిక్‌ సైఫన్లు సోమవారం 5 తెరుచుకున్నాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద రావడంతో 5 గేట్ల నుంచి సుమారు 6వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల అవుతు న్నాయి. దీంతో ఆత్మకూర్‌, వనపర్తి రహదారిపై ఉన్న కాజ్‌వేలపై నీరు ప్రవహి స్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇలా అయిదు రోజులుగా రాక పోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే రామన్‌పాడు ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్‌ ఏఈ ప్రమోద్‌ తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 11:14 PM