బీసీలకు 42శాతం అమలు చేయాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:11 PM
బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు భిక్ష కాదు - ముమ్మా టికీ హక్కు అని బీసీ జేఏసీ కో-చైర్మన్ మున్నూ రు రాజు అన్నారు.
పాలమూరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు భిక్ష కాదు - ముమ్మా టికీ హక్కు అని బీసీ జేఏసీ కో-చైర్మన్ మున్నూ రు రాజు అన్నారు. సమాజంలో అధిక శాతం ఉన్న బీసీలకు 42శాతం రిజర్వేషన్ ధర్మ బ ద్ధంగా, న్యాయ బద్ధంగా ఇవ్వమని అడగటం వందశాతం న్యాయమైంది. ఆదివారం జిల్లా కేం ద్రంలోని ధర్నాచౌక్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ‘బీసీ న్యాయ సాధన దీక్ష’ చేపట్టారు. ముఖ్య మంత్రి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధా నితో మాట్లాడి 42శాతం రిజర్వేషన్‌పై చర్చించే ప్రయత్నం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్పీ వెంకటేష్, గోనెల శ్రీనివాస్, రాములు, విజయ్ కుమార్, కోరమోని వెంకటయ్య, కొండా బాల య్య, సుధాకర్, నరసింహా, గణేష్, శాంతయ్య, యాదయ్య పాల్గొన్నారు.