బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే
ABN , Publish Date - Nov 02 , 2025 | 10:34 PM
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే నని, లేదంటే మరో తెలంగాణ ఉద్యోమం మొదలవుతుందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడాల శ్రీనివాస్ సాగర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
భూత్పూర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే నని, లేదంటే మరో తెలంగాణ ఉద్యోమం మొదలవుతుందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడాల శ్రీనివాస్ సాగర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం మునిసిపల్ కేంద్రంలో చాయ్‌పే చర్చా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల మేధావులతో కలిసి చాయ్ పే చర్చా కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా బీసీలు, ఇతర కులాల వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఫలాలు, ఇతర అన్నీ రకాల రిజర్వేషన్లు అందుకోలేక ఆగమయ్యామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు తరహలో బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్దత కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ రాజ్యంగ సవరణ చేసి 9వ షెడ్యూలో పెడితే తప్ప బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందుతాయని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడాల శ్రీనివాస్ అన్నారు. బీసీ సంఘాలతో పాటు వివిధ కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావుల సంఘాలను కలుపుకొని బీసీ రిజర్వేషన్ కోసం మన హక్కుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. విశ్రాంతి డీఈవో విజయ్‌కుమార్, మేధావుల సంఘం నాయకులు జుర్రు నారాయణ, బత్తుల మల్లేష్ యాదవ్, రమేష్‌గౌడ్, ప్రొఫెసర్ డాక్టర్ రామరాజు, టూవిల్లర్ పట్టణ ఉపాధ్యక్షుడు కృష్ణ, గొడుగు రాజు, శివాచారి, గుంటి గోపి, నరసింహ, రఘు, సాయిశంకర్, బాలరాజు, రాజు పాల్గొన్నారు.