Share News

42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి

ABN , Publish Date - May 18 , 2025 | 11:32 PM

ఏడున్నర దశాబ్దాల నుంచి కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పా ర్టీలు బీసీలను అన్ని రంగాల్లో చిన్న చూపు చూ స్తూ మోసం చేశాయని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ దాసరి అజయ్‌ కు మార్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలి
కొల్లాపూర్‌లో రిలే నిరాహార దీక్షను ఉద్దేశించి మాట్లాడుతున్న బీసీ జన చైతన్య సభ జాతీయ అధ్యక్షుడు దాసరి అజయ్‌ కుమార్‌ యాదవ్‌

- ఆ మూడు పార్టీలు బీసీలను మోసం చేశాయి

- బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ దాసరి అజయ్‌ కుమార్‌ యాదవ్‌

కొల్లాపూర్‌, మే 18 (ఆంధ్రజ్యోతి): ఏడున్నర దశాబ్దాల నుంచి కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ పా ర్టీలు బీసీలను అన్ని రంగాల్లో చిన్న చూపు చూ స్తూ మోసం చేశాయని బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ దాసరి అజయ్‌ కు మార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఆదివారం కొల్లా పూర్‌ నియోజకవర్గ కేంద్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి జేఏసీ నాయకులు ఆ ధ్వర్యంలో పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు ఫూ లే విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళు లర్పించారు. అక్కడి నుంచి పట్టణ పుర వీధుల గుండా రాజా బంగ్లా వరకు బీసీ హక్కుల సాధ నకై నినాదాలు చేశారు. అనంతరం పట్టణంలో ని రాజా బంగ్లా ముందు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరంలో కాంగ్రెస్‌ పార్టీ నాయ కులు డాక్టర్‌ పగిడ్యాల శ్రీనివాస్‌ రెడ్డి, రిటైర్డ్‌ డీఈవో శివార్చక విజ య్‌ కుమార్‌, అసిస్టెం ట్‌ ప్రొఫెసర్‌ పెబ్బేటి మల్లికార్జున్‌, పచ్చిపాల సుబ్బయ్య, బీసీ కుల సంఘాల నాయకుల తో కలిసి బీసీ జన చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ దాస రి అజయ్‌ కుమార్‌ యాదవ్‌ రిలే నిరాహా ర దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు పరిచే వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతీ నియోజక వర్గ కేంద్రంలో రి లే దీక్షలు చేపడతామన్నారు. ముందుగా సీఎం సొంత జిల్లా అయిన నాగర్‌కర్నూల్‌ జిల్లా నుం చి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించామని తెలి పారు. కొల్లాపూర్‌లో రిలే దీక్షకు బీసీలు స్వచ్ఛం దంగా తరలి వచ్చి పాల్గొన్నారని, గ్రామ గ్రా మాన బీసీ కులాలను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తం గా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తాము ఉద్యమిస్తామన్నారు. మండల్‌ ఆర్మీ వ్య వస్థాపక అధ్యక్షుడు శివ శంకర్‌ యాదవ్‌, సదా నంద్‌ గౌడ్‌, బీసీ జన చైతన్య వేదిక రాష్ట్ర యువ జన విభాగం అధ్యక్షుడు బోయిని మహేష్‌ యా దవ్‌, బీసీ జన చైతన్య వేదిక నాగర్‌కర్నూల్‌ జి ల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌, రాజేందర్‌, మేకల సాయిలు యాదవ్‌, వాకిటి ఆంజనేయు లు గాలి యాదవ్‌, 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి జేఏసీ నాయకులు, బీసీ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 11:32 PM