Share News

మొదటి విడత బరిలో 325 మంది

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:21 PM

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామసర్పంచు ఎన్నికల్లో 325 మంది బరిలో ఉన్నారు.

మొదటి విడత బరిలో 325 మంది

  • 15 సర్పంచులు, 361 వార్డులు ఏకగ్రీవం - బరిలో 1,425 మంది

గద్వాల, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామసర్పంచు ఎన్నికల్లో 325 మంది బరిలో ఉన్నారు. గద్వాల, ధరూర్‌, గట్టు, కేటీదొడ్డిలోని నాలుగు మండలాల్లో 106 గ్రామ పంచాయతీలకు 924 వార్డు మెంబర్లకు నామినేష న్లు స్వీకరించగా 15 గ్రామ పంచాయతీలో ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా వార్డు మెంబర్లు 361 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలి న 91 గ్రామ పంచాయతీల్లో 325 మంది సర్పంచులుగా, 613 వార్డులలో 1,425 మం ది బరిలో ఉన్నారు. గద్వాల మండలంలో 28 గ్రామ పంచాయతీలో మూడు ఏకగ్రీవం కాగా 25 గ్రామ పంచాయతీలలో సర్పంచు కోసం 100 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా 437 మంది వార్డు సభ్యుల కో సం పోటీలో ఉన్నారు. ధరూర్‌ మండలంలో 28లో నాలుగు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచుల కోసం 72 మంది, వార్డు సభ్యుల కోసం 367 మంది పోటీలో ఉన్నారు. ఽగట్టు మండలంలో 27 పంచాయతీల్లో ఆరు ఏకగ్రీవం అయ్యా యి. మిగిలిన 21లో సర్పంచుల కోసం 79 మంది వార్డు సభ్యుల కోసం 338 మంది పోటీలో ఉన్నారు. కేటీదొడ్డి మండలంలో 23 గ్రామ పంచాయతీల్లో రెండు ఏకగ్రీవం అయ్యాయి. 21 పంచాయతీల్లో 74 మంది స ర్పంచు కోసం 283 మంది వార్డు సభ్యుల కో సం పోటీ పడుతున్నారు. బుధవారం నుంచి ప్రచారం ప్రారంభించారు.

Updated Date - Dec 04 , 2025 | 11:21 PM