Share News

కురుమూర్తి జాతరకు 270 ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:48 PM

కురుమూ ర్తి స్వా మి జాతరకు 270 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మహ బూబ్‌నగర్‌ ఆర్టీసీ ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

కురుమూర్తి జాతరకు 270 ప్రత్యేక బస్సులు

మహబూబ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కురుమూ ర్తి స్వా మి జాతరకు 270 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మహ బూబ్‌నగర్‌ ఆర్టీసీ ఆర్‌ఎం సంతోష్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌ నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, కొత్తకోట, పెబ్బేరు, దేవరకద్ర, ఆత్మకూర్‌ ఇతర ప్రాంతాల నుంచి బస్సులను నడుపు తున్నట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం దృష్ట్యా ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండబోతుంద ని, అసౌకర్యం కలగకుండా బస్టాండ్లలో, కురుమూర్తి దేవస్థానం వద్ద ప్రత్యేక శిబిరాలు, తాగునీటి వసతి, టెంట్లు, ప్రయాణికులకు సహకరించ డానికి వలంటీర్లను ఏర్పా టు చేసినట్లు తెలిపారు.

దేవరకద్ర: కురుమూర్తి జాతరకు దేవరకద్ర నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు నారయణపేట డీఎం లావణ్య తెలిపా రు. గురువారం ఆ మె దేవరకద్ర బస్టాండ్‌ను పరిశీలించారు. నారాయణపేట డిపోకు చెం దిన ఆర్టీసీ బస్సులను వారం రోజుల పాటు నడుస్తాయని పేర్కొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:48 PM