తొలి విడతలో 23 గ్రామాలు ఏకగ్రీవం
ABN , Publish Date - Dec 03 , 2025 | 11:34 PM
: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతకు సంబంధించి మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో 9, నారాయణపేట జిల్లాలో 14 పంచాయతీలు
నారాయణపేట/మహబూబ్‌నగర్ రూరల్/గండీడ్/మహమ్మదాబాద్/రాజాపూర్/నవాబ్‌పేట, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతకు సంబంధించి మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 139 గ్రామ పంచాయతీలకు 9, నారాయణపేట జిల్లాలో 67 గ్రామ పంచాయతీలకు 14 గ్రామాల సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం తొలి విడత ఎన్నికల ఉపసంహరణ ముగియడంతో అధికారులు ఏకగ్రీవాలను ప్రకటించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి నవాబ్‌పేట మండలం కాకర్జాల నుంచి మాడభూషి రాజు సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దొడ్డుపల్లి నుంచి వల్లూరు సువర్ణ, పల్లెగడ్డ నుంచి బాలరాజు, గండీడ్ మండలం అంచన్‌పల్లి నుంచి బచ్చన్నగారి చెన్నారెడ్డి, మన్సూర్‌పల్లి నుంచి కొమిరె నాగేంద్రమ్మ, మహ్మదాబాద్ మండలం ఆముదాలగడ్డ తండా నుంచి రాంచెందర్‌నాయక్, మహబూబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబ్లాయిపల్లి నుంచి కృష్ణయ్య, రాజాపూర్ మండలంలోని మోదుగకుంట తండా నుంచి సభావత్ గీత, కల్లెపల్లి నుంచి చందర్ నాయక్ ఏక్రగీవంగా ఎన్నికయ్యారు.
నారాయణపేట జిల్లాలో..
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో నందిగామ సర్పంచ్‌గా శారద ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లింగాల్‌చేడ్ నుంచి విజయలక్ష్మీ, నిడ్జింత నుంచి రజిత, వాల్యానాయక్ తండా నుంచి రమేష్‌నాయక్ సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. లింగాల్ చేడ్‌లో వార్డు మెంబర్లను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ఈ గ్రామంలో ఓటింగ్ ఉండదు. మద్దూర్ మండలంలో అప్పిరెడ్డిపల్లి నుంచి బి.మల్లీశ్వరి, చంద్య్రనాయక్ తండా నుంచి సోమ్లానాయక్, ధమ్లా తండా నుంచి రాత్లావత్ అనిత, మోమినాపూర్ నుంచి గూళ్ల శ్రీదేవి, పర్సపూర్ నుంచి అంజిలమ్మ, పెద్రిపహడ్ నుంచి అనుసూజ, గుండుమాల్ మండలంలో అప్పయ్యపల్లి తండా నుంచి రాజేందర్ నాయక్, పెద్ద తండా నుంచి శ్రీకృష్ణనాయక్, భక్తిమళ్ల నుంచి శ్రీకాంత్, కుమ్మరి కుంట తండా నుంచి జ్యోతి సర్పంచ్‌లుగా ఏకగ్రీవమయ్యారు.