200 గ్రాముల గంజాయి స్వాధీనం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:37 PM
గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జడ్చర్ల సీఐ కమలాకర్ తెలిపారు. వారి వద్ద 200 గ్రాముల గంజాయితో పాటు నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. జడ్చర్ల పోలీ్‌స స్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
నలుగురి అరెస్టు: జడ్చర్ల సీఐ
జడ్చర్ల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు జడ్చర్ల సీఐ కమలాకర్ తెలిపారు. వారి వద్ద 200 గ్రాముల గంజాయితో పాటు నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. జడ్చర్ల పోలీ్‌స స్టేషన్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. జడ్చర్ల ఎస్‌ఐ మల్లేష్, హెడ్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్స్ భీమేష్, నరసింహులు, నాగరాజు, విష్ణులతో కలిసి శనివారం ఉదయం 9:30 గంటలకు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. 44వ నెంబరు జాతీయ రహదారి, జడ్చర్ల ఆర్‌అండ్‌బీ అతిథి గృహం సమీపంలో నలుగురు అనుమానాస్పదంగా కనిపించారు. వారి వద్దకు వెళ్తుండగా పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటపడి అదుపులోకి తీసుకున్నారు. వారు జడ్చర్ల పట్టణంలోని ఫిరోజ్‌నగర్‌కు చెందిన అబ్బుతాలిబ్, బాదేపల్లి సంజీవయ్య కాలనీకి చెందిన గుండు హరిప్రసాద్, మహబూబ్‌నగర్‌లోని పాలసాబ్ గుట్టకు చెందిన ఎండీ అజర్‌అలీ, బాదేపల్లి నిమ్మబావిగడ్డకు చెందిన విద్యార్థి మందకార్తీక్. వారిని విచారించగా, వారి వద్ద నల్లరంగు ప్లాస్టిక్ కవర్లలో గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. 200 గ్రామల గంజాయిని, అలాగే నాలుగు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అబ్బుతాలిబ్ హైదరాబాద్‌లోని ధూల్‌పేట ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి, జడ్చర్ల పరిసర ప్రాంతాలలోని యువతకు విక్రయిస్తుండగా, మిగిలిన ముగ్గురు సహకరించేవారు. ఇతడిపై గతంలో దొంగతనం కేసుతో పాటు పోక్సో, ఇతర కేసులలో జైలుకు వెళ్లాడు. నిందితులపై ఎన్‌డీపీఎ్‌స చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి నమూనాను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జడ్చర్ల ఎస్‌ఐ మల్లేష్, సిబ్బంది పాల్గొన్నారు.