మాదిగలకు 18శాతం రిజర్వేషన్లు కల్పించాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 11:00 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని ఏఐసీసీ కార్యదర్శి, అలం పూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కోరారు.
ఏఐసీసీ కార్యదర్శి వినతి
వడ్డేపల్లి, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 శాతం రిజ ర్వేషన్లు కల్పించాలని ఏఐసీసీ కార్యదర్శి, అలం పూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ కోరారు. ఈమేరకు బుధవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎస్సీ, ఎస్టీ సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిగలకు 18 శాతం రిజర్వేషన్లు అమలు చేసి, అందుకు అనుగుణంగా సీట్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కొండేటి మల్లయ్య, మామిడి గోపి ఉన్నారు.