పోలీస్ ప్రజావాణికి 18 ఫిర్యాదులు
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:08 PM
ప్రజా సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు.
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడమే పోలీసుల లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీసుల కార్యాలయంలో ప్రజావాణికి 18 ఫిర్యాదులు రాగా, స్వీకరించి సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అన్ని ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కారంపై నిఘా ఉంచడం జరుగుతుందన్నారు.
లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఈనెల 13 న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జానకి సోమారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజీకాదగిన అన్ని కేసులను పరిష్కరించుకోవాలని, పోలీసులు కూడా కేసుల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన, కుటుంబ పరమైన కేసులు, వైవాహిక జీవితం సంబంధించినవి, బ్యాంకు రికవరీ, విద్యుత్‌చౌర్యం, చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరించుకోవాలని కోరారు.