Share News

15 క్వింటాళ్ల పత్తి దగ్ధం

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:05 PM

నిల్వ ఉంచిన చోట ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని 15 క్వింటళ్ల పత్తి దగ్ధమైన సం ఘటన గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల కేంద్రంలో చోటు చేసు కుంది.

15 క్వింటాళ్ల పత్తి దగ్ధం
మంటలను ఆర్పుతున్న రైతులు

- రూ. 3.5 లక్షల ఆస్తినష్టం

ఊట్కూర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): నిల్వ ఉంచిన చోట ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని 15 క్వింటళ్ల పత్తి దగ్ధమైన సం ఘటన గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండల కేంద్రంలో చోటు చేసు కుంది. గ్రామస్థుల కథనం ప్రకారం... ఊ ట్కూర్‌ మండల కేంద్రంలోని కుర్వ వీధికి చెందిన లడ్డచంద్రపొల్ల మల్లెష్‌ అనే కౌలు రైతు తన సొంత పొలం 4 ఎకరాలతో పా టు గ్రామ సమీపంలో 10 ఎకరాల భూమి ని కౌలుకు తీసుకుని పత్తి పంటను సాగు చేశారు. అనంతరం 14 ఎకరాల్లో తీసి సు మారు 50 క్వింటళ్ల పత్తిని పొలం నుంచి తీసిన తర్వాత గ్రామ సమీపంలోని కౌలు పొలంలో అమ్మడానికి వాటిని నిల్వచేశారు. గురువారం పొలానికి వచ్చి న రైతు మల్లప్ప పత్తి అ మ్మడానికి పోవాల్సి ఉండ టంతో కూలీల కోసం గ్రా మంలోకి వెళ్లాడు. కొంత స మయం తర్వాత పత్తి ఉన్న ప్రదేశం నుంచి పొగలు రా వడంతో పక్కపొలాల్లో కూలీలు గమనించి చూడగా అప్పటికే లోన నిప్పు అంటుకోవ డంతో వెంటనే ఆర్పే ప్రయత్నం చేశారు. రైతుతో పాటు గ్రామస్థులకు తెలియజేశారు. వారు ఫైర్‌ ఇంజన్‌ అధికారులకు సమాచా రం ఇచ్చారు. ఫైర్‌ఇంజన్‌ వచ్చి మంటలను ఆర్పడంతో అప్పటికే దాదాపు 15 క్వింటళ్ళ పత్తి దగ్ధమయ్యింది. వెంటనే కూలీలు కాలి పోయిన దాంట్లో నుంచి మిగిలిన పత్తిని వే రు చేసి మందు స్ర్పేయర్‌ మందు డబ్బాతో పూర్తి స్థాయిలో మంటలను ఆర్పారు. కాలి పోయిన పత్తిని చూసి రైతు కుటుంబ స భ్యులు బోరున విలపించారు. అనంతరం అ గ్నిమాపక శాఖ ఎస్‌ఐ రమేష్‌రెడ్డి, రెవెన్యూ ఆర్‌ఐ కృష్ణారెడ్డిలు పంచనామా నిర్వహించా రు. విషయం తెలసుకున్న మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాష్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోవింద ప్ప, యువజన కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కోరం మహేశ్వర్‌రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని రైతును పరామర్శించారు.

Updated Date - Nov 20 , 2025 | 11:05 PM