Share News

1.2 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:09 PM

మహబూబ్‌నగర్‌ జి ల్లా, బాలానగర్‌ మండలంలోని గుండేడు నుంచి ఉడిత్యాల వెళ్లే దారిలోని కిరాణం దుకాణంలో గంజాయిని పట్టుకున్నట్లు జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ విప్లవ్‌ రెడ్డి తెలిపారు.

1.2 కిలోల గంజాయి పట్టివేత
పట్టుకున్న గంజాయి, నిందితులను అరెస్ట్‌ చేసిన వివరాలను వెల్లడిస్తున్న జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ విప్లవ్‌రెడ్డి

- ముగ్గురు నిందితుల అరెస్టు

- జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ విప్లవ్‌రెడ్డి

జడ్చర్ల/బాలానగర్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : మహబూబ్‌నగర్‌ జి ల్లా, బాలానగర్‌ మండలంలోని గుండేడు నుంచి ఉడిత్యాల వెళ్లే దారిలోని కిరాణం దుకాణంలో గంజాయిని పట్టుకున్నట్లు జడ్చర్ల ఎక్సైజ్‌ సీఐ విప్లవ్‌ రెడ్డి తెలిపారు. అందుకు సంబందించి ఆయన తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. కిరాణషాపులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నారన్న సమా చారం అందడంతో పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. దుకాణంలో కిషన్‌, నేనావత్‌ కృష్ణ అలియాస్‌ కిష్‌, నేనావత్‌ లాలిల వద్ద 1.2 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్ర వాహనం, రెండు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారు హైదరాబాద్‌ నుంచి కిలో ఎండు గంజాయిని రూ.15వేలకు కొనుగోలు చేసి, ఆరు గ్రాముల ప్యాకెట్‌లను తయా రు చేస్తారని సీఐ తెలిపారు. ఒక్కో ప్యాకెట్‌ను రూ.400కు వివిధ కంపెనీ ల్లో పని చేసే కార్మికులకు విక్రయిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు నింది తులపై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. దాడులలో జడ్చ ర్ల ఎక్సైజ్‌ ఎస్‌ఐ నాగరాజు, సిబ్బంది సిద్దార్థ, స్నేహలత, సునీత తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:24 PM