Share News

ఇళ్ల మధ్యే.. 11 కేవీ విద్యుత్‌ లైన్‌

ABN , Publish Date - Aug 31 , 2025 | 11:43 PM

మండలంలోని ఇబ్రహీంబాద్‌ గ్రామంలో ఇళ్ల మధ్యలో 11 కేవీ విద్యుత్‌ లైన్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండడంతో చుట్టు పక్కన ఇళ్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

ఇళ్ల మధ్యే.. 11 కేవీ విద్యుత్‌ లైన్‌
ఇళ్లపై ఉన్న 11 కేవీ విద్యుత్‌ లైన్లు

పట్టించుకోని విద్యుత్‌ అధికారులు

హన్వాడ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని ఇబ్రహీంబాద్‌ గ్రామంలో ఇళ్ల మధ్యలో 11 కేవీ విద్యుత్‌ లైన్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ ఉండడంతో చుట్టు పక్కన ఇళ్ల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. హన్వాడ సబ్‌స్టేషన్‌ నుంచి గ్రామానికి 11 కేవీ ద్వారా విద్యుత్‌ సరాఫరా అవుతోంది. ప్రస్తుతం లైన్‌ ఇళ్ల మధ్యలో ఉందని, ఇక్కడి నుంచి తొలగించి ఊరి బయట ఏర్పాటు చేయాలని గ్రామస్థులు విద్యుత్‌ అధికారులు, ప్రజాప్రతినిధులకు పలు సార్లు విన్నవించారు. కానీ ఆ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఆ విద్యుత్‌ లైన్‌ కూడా చాలా సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిందని ఎప్పుడు తెగుతుందోనని భయపడుతున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 11:43 PM