చోరీకి గురైన 100 సెల్‌ఫోన్లు రికవరీ
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:49 PM
దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ను పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికవరీ చేస్తు న్నారు.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): దొంగిలించబడిన సెల్‌ఫోన్ల ను పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రికవరీ చేస్తు న్నారు. మహబూబ్‌నగర్ టుటౌన్ పరిధిలో కొంతకాలంగా చోరీకి గురైన 100 సెల్‌ఫోన్‌లను సీఈఐఆర్(సెంట్రల్ ఎక్యూప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్) పోర్ట ల్ ద్వారా గుర్తించి రికవరీ చేశారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయం లో బాధితులకు ఎస్పీ జానకి చేతుల మీదుగా పోయిన ఫోన్‌లను తిరిగి అ ప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సెల్‌ఫోన్ దొంగిలించబడిన వెంటనే పోగొట్టుకున్న బాధితులు సీఈఐఆర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవా లన్నారు. ఈ పోర్టల్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి రికవరీ చేయవ చ్చన్నారు. ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రగతిశీల టెక్నాలజీపై ఆధారపడిన గొప్ప సాధనమని చెప్పారు. సైబర్‌క్రైమ్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎస్పీ స్వయంగా సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ మోసాలు, బ్యాంకింగ్ మోసాలు వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. ప్రజల్లో సైబర్ నేరాలపై ఉన్న అవగాహన స్థాయిని అంచనా వేయడాని కి ఎస్పీ కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చిన ఎలికిచర్ల గ్రామానికి చెందిన అడ్డకల శివుడు బెస్ట్ సిటిజన్ అవార్డు అందుకు న్నారు. అదనపు ఎస్పీ రాములు, ఏఆర్ అదనపు ఎస్పీ సురేశ్‌కుమార్, డీసీ ఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, టుటౌన్ సీఐ ఎజాజు ద్దీన్, ఆర్‌ఐలు కృష్ణయ్య, రవి, ఎస్సై విజయభాస్కర్, ఆర్‌ఎస్‌ఐ రవి తదిత రులు పాల్గొన్నారు.