జిల్లాకు 10 మంది టూరిస్టు పోలీసులు
ABN , Publish Date - Oct 13 , 2025 | 11:36 PM
నాగర్‌కర్నూల్ జిల్లా కు 10 మంది టూరిస్టు పోలీసులను ప్రభుత్వం కేటాయించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు.
- నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్‌కర్నూల్ క్రైం/ కొల్లాపూర్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా కు 10 మంది టూరిస్టు పోలీసులను ప్రభుత్వం కేటాయించినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. జిల్లాలోని ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ప్రతీ సంవత్సరం నిర్వహించే జాతరలు, ఉత్సవాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా వారు పర్యవేక్షించనున్నారు. అలాగే పర్యాటక కేం ద్రాల వద్ద సందర్శకులకు అవసరమైన భద్రత కల్పించనున్నారు. జిల్లాకు కేటాయించి న టూరిస్టు పోలీసులు సోమవారం కొల్లా పూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణా రావు క్యాంపు కార్యాలయంలో, పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహకు రిపో ర్టు చేశారు.