గూడెంలో మాఘశుద్ధ పౌర్ణమి జాతర
ABN , Publish Date - Feb 12 , 2025 | 11:43 PM
గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు, మాఘశుద్ధ పూర్ణిమిని పురస్కరించుని బుధవారం దేవాలయంలోని సత్యదేవుడికి పుష్పాలంకరణతో ప్రత్యేక పూజల వైభవో పేతంగా నిర్వహించారు.

ఘనంగా పూర్ణాహుతి, నిత్య హోమం
దండేపల్లి, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు, మాఘశుద్ధ పూర్ణిమిని పురస్కరించుని బుధవారం దేవాలయంలోని సత్యదేవుడికి పుష్పాలంకరణతో ప్రత్యేక పూజల వైభవో పేతంగా నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు గోవర్ధన రఘస్వామి, సంపత్ స్వామి ఆధ్వర్యంలో వేదపండితులు అభిరామ్‌చార్యులు, నారాయణశర్మ, భరత్‌శర్మలు చాత్తాధ శ్రీ వైష్టవ ఆచార సంప్రదాయం ప్రకారం స్వామి వారికి జయాది హోమం, శాంతి హోమం, మహా పూర్ణాహుతి, బలిహరణము, నిత్య విధి, ప్రాభోధిక ఆరగింపు తో పాటు స్వామి వారి సేవ కార్యక్రమా లను వైభోపేతంగా నిర్వహించారు.
పౌర్ణమి రోజు భక్తులు పవిత్ర గోదా వరి నదిలో పుణ్యస్నానం చేసి ప్రత్యేక పూజలు చేశారు. వందలాది మంది భక్తులు కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో సామూహిక స్వామి వ్రతాలను ఆచరించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులందరికీ స్వామి తీర్ధప్ర సాలను అందజేశారు. అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ పేర్కొ న్నారు. పౌర్ణమి జాతరతోగూడెం పరిసర ప్రాంతమంతా భక్తులతో సందడి నెలకొంది. ఆలయంలో నిరంతరంగా సపాహ్త భజన కొనసాగుతోంది.