Share News

Democratic Teachers Federation: డీటీఎఫ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , Publish Date - Aug 18 , 2025 | 04:54 AM

డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నల్లగొండకు చెందిన ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ నుంచి టి.లింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Democratic Teachers Federation: డీటీఎఫ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

  • అధ్యక్షుడిగా సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా లింగారెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (డీటీఎఫ్‌) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నల్లగొండకు చెందిన ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శిగా హనుమకొండ నుంచి టి.లింగారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పి.శంతన్‌(నిజామాబాద్‌), వి.రాజిరెడ్డి(కరీంనగర్‌), టి.శ్రీశైలం(మహబూబ్‌నగర్‌), బి.రేణుక(హైదరాబాద్‌), చాప బాబు(ములుగు) ఎన్నికయ్యారు.


అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులుగా ఎం.గంగాధర్‌(హనుమకొండ), ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా పి.ఈశ్వర్‌ రెడ్డి(కరీంనగర్‌), సభ్యులుగా సిహెచ్‌.వెంకటేశ్వర్లు(సూర్యాపేట), బి.సదానందం(సిరిసిల్ల) ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవనంలో జరిగిన 15వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు.

Updated Date - Aug 18 , 2025 | 04:54 AM