బెల్లంపల్లి చెత్త వాహనాలను అడ్డుకున్న స్థానికులు
ABN , Publish Date - Feb 17 , 2025 | 11:28 PM
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో సేకరిం చిన చెత్తను కాసిపేట మండలంలోని సోమగూడెం 1వ గని సమీపంలో పడేయడాన్ని వచ్చిన చెత్త వాహనాలను సోమవారం దుబ్బగూడెం సమీపంలో స్థాని కులు అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు.

-దుబ్బగూడెం రోడ్డుపై బైఠాయించి నిరసన
కాసిపేట, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి) : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో సేకరిం చిన చెత్తను కాసిపేట మండలంలోని సోమగూడెం 1వ గని సమీపంలో పడేయడాన్ని వచ్చిన చెత్త వాహనాలను సోమవారం దుబ్బగూడెం సమీపంలో స్థాని కులు అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. స్ధానిక నాయకులు దుర్గం గోపాల్, సాపాట్ శంకర్, గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ కేకే ఓసీపీ వల్ల సింగరేణి యాజమాన్యం కాసిపేట మండలంలో విధ్వంసం సృష్ఠించి ప్ర జల జీవితాలను చిన్నాభిన్నం చేస్తుందన్నారు. ఇప్పుడు బెల్లంపల్లి మున్సిపాలిటీలో సేకరించిన చెత్తను కాసిపేట మండ లంలో పడేయడం ఏమిటని ప్రశ్నించారు. చెత్తా, చెదారం, వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో స్ధానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త కాల్చినప్పుడే వచ్చే పొగ ద్వారా గాలి కలుషితమై స్ధానిక ప్రజలు శ్వాస కోశ వ్యాధుల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారన్నారు. దీనిపై గతంలోనే చెప్పినా మున్సిపాలిటీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలపడంతో రెండు గంటల పా టు ఉద్రిక్తత నెలకొంది. కాసిపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చెత్త వాహనాలను తిరిగి బెల్లంపల్లికి పంపించడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో స్ధానికులు, మహిళలు పాల్గొన్నారు.