Share News

Harpal Singh: నీటి పారుదల గౌరవ సలహాదారుగా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హర్పాల్‌ సింగ్‌

ABN , Publish Date - Aug 22 , 2025 | 04:46 AM

నీటిపారుదల శాఖ గౌరవ సలహాదారుడిగా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హర్పాల్‌సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Harpal Singh: నీటి పారుదల గౌరవ సలహాదారుగా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హర్పాల్‌ సింగ్‌

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖ గౌరవ సలహాదారుడిగా లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హర్పాల్‌సింగ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దు రహదారుల సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గానూ, భారతసైన్యంలో ఇంజనీరింగ్‌ విభాగంలో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ)గా కీలక భూమిక పోషించిన ఆయన... పదవీ విరమణ తర్వాత వేతనం, పారితోషికం తీసుకోకుండా రెండేళ్లపాటు తెలంగాణకు సేవలందించనున్నారు.


ఈ మేరకు సీఎస్‌ కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టన్నెల్‌ నిర్మాణంలో అపార అనుభవం ఉన్న ఆయన సేవలను శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌ నిర్మాణంలో వినియోగించుకోనున్నారు. సాంకేతిక పరిజ్ఞానం భద్రతకు ఈ నియామకం దోహదపడుతుందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 04:46 AM